పులివెందులలో వైసీపీ నేత కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం

 

కడప : ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన ఆయన అనంతరం పులివెందులలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. వైసీపీ నేత మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ నేడు పులివెందుల ఎన్సీఎస్సార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు అందించారు. వివాహ వేదికపై సీఎం ఉత్సాహంతో కనిపించారు. వైసీపీ నేత కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం, నియోజకవర్గ ప్రజలను కూడా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest