పెద్దపల్లి టికెట్ గోమాస శ్రీనివాస్ కే ఇవ్వాలి- మంత్రి శ్రీధర్ బాబుకు నేతకాని సంఘం వినతి

 

హైదరాబాద్ , 25 జనవరి 2024

పెద్దపల్లి పార్లమెంట్ స్తానని అత్యధికంగా ఉన్న నేతకాని సామజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని , కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా పని చేస్తున్న గోమాస శ్రీనివాస్ కు ఇస్తే గెలిపించుకుంటామని తెలంగాణ నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం మంత్రి, పెద్దపల్లి ఇంచార్జి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు విజ్ఞ్యప్తి చేసింది. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. గోమాస శ్రీనివాస్ కు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పారు. ఎంతో కాలంగా నేతకాని సామజిక వర్గం కాంగ్రెస్ తోనే ఉందని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు .యేసుకురి. రాజమల్లు, ముఖ్య సలహాదారు జాడి ముసలయ్య మురళీధర్ . రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. దుర్గం ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టేకుమట్ల ప్రభాకర్. రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం రాజన్న రైతుబలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి రాజన్న. సంఘం సీనియర్ నాయకులు దుర్గం గోపాల్.దుర్గం రాజేష్ దుర్గం శేఖర్. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొట్టాల నాగరాజు. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ముడిమడుగుల శ్రీనివాస్. జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం అంజన్న సంగం నాయకులు మహిళ నాయకురాలు అదిలాబాద్ జిల్లా సరపె.సోంబాయి తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest