ప్రేమికుడు మే 1న రీ రిలీజ్

ప్రభుదేవ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమికుడు ప్రపంచవ్యాప్తంగా మే 1న 300 థియేటర్లలో అద్భుతమైన బుకింగ్స్ తో గ్రాండ్ రీ రిలీజ్

మెగా ప్రొడ్యూసర్ కే. టి.  కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ రిలీజ్ కి సంబంధించిన వేడుక నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ మరియు శోభారాణి  పాల్గొన్నారు.

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300 కు పైగా థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవా తో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్స్. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీస్ కి అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.

శోభారాణి  మాట్లాడుతూ : మురళీధర్ రెడ్డి , రమణ , ప్రేమికుడు సినిమాని మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రేమికుడు సినిమాని 4K క్వాలిటీలో విడుదల చేస్తున్నాము. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ప్లే చేస్తున్నప్పుడు చాలా మంచి స్పందన లభించింది. ఒక మంచి లవ్ స్టోరీ అదేవిధంగా పొలిటికల్ డ్రామా కూడా ఈ ప్రేమికుడు సినిమాలో ఉన్నాయి. ఇందులో లెజెండరీ సింగర్ ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన అదే విధంగా ఆయన చేసిన డాన్స్ సినిమాకి పెద్ద ప్లస్ గా నిలిచాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఈ సినిమాకి పాటలకి ఇదే స్పందన ఉంటుంది. ఈ ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

నటీనటులు : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా, ఎస్. పి. బాలసుబ్రమణ్యం, గిరీష్ కర్నాడ్, వడివేలు, రఘువరన్ తదితరులు.

టెక్నీషియన్స్ :
నిర్మాణం : జెంటిల్మెన్ ఫిలిం ఇంటర్నేషనల్
నిర్మాతలు : మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్
మ్యూజిక్ : ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్. రెహమాన్
దర్శకుడు : సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్
వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ : మురళీధర్ రెడ్డి, రమణ
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ : సి ఎం ఆర్ ప్రొడక్షన్స్
పి ఆర్ ఓ : మధు VR

Prabhu Deva Starrer Sensational Blockbuster Movie Premikudu Grand Re-Release on 1st May in 300+ Theaters Worldwide with Amazing Opening Booking

Mega Producer K. T. Kunjumon As the producer and directed by sensational director S. Shankar, Music by Oscar winner A. R. Rahman and starring by Indian Michael Jackson Prabhu Deva and beautiful actress Nagma movie Premikudu is going to be re-released. Ramana and Muralidhar are acting as the re release producers of this movie. SP Balasubramaniam, Vadivelu, Raghuvaran and Girish Karnad acted in lead roles. The event for this re-release was held very grandly today. Producers Muralidhar Reddy, Ramana, famous producer Lagadapati Srinivas and Shobharani were present in this ceremony.

The movie Premikudu, which released 30 years ago, is being re-released in more than 300+ theaters on May 1st. Bookings are open and getting excellent response from audience. Premikudu is Directed by S. Shankar, starring Indian Michael Jackson Prabhu Deva and Nagma’s movie released 30 years ago and impressed the youth. Even now, the songs of that movie continue to impress everyone, not just the youth. Prabhu Deva’s father S. P. Balasubramaniam’s acting is a big plus for the movie. S. P. Balu’s dancing is equal to Prabhudeva in the song andamaina premarani cheyyi tagilithe is special. Takeit Easy Policy, O Chelia Na Priya Sakhia songs are still evergreen songs. The movie which came out as a good youth full love story was the biggest blockbuster in those days.

Producer Muralidhar Reddy said : After 30 years, we are releasing Premikudu worldwide on May 1 under CMR production. As soon as the bookings are opened, there is an excellent response from the audience. We also thank the distributors for their support. Similarly, we would like to express our special thanks to our mega producer Kunjumon sir who has agreed to release this movie and supporting us.

Shobharani Garu said: Muralidhar Reddy Garu, Ramana Garu is releasing Premikudu movie worldwide on May 1. Distributors are also very supportive. Now we are releasing this Premikadu movie in 4K quality. The teaser and trailer of this movie got very good response while playing. A good love story as well as a political drama are present in this Premikadu movie. Legendary singer S. P. Balasubramaniam’s performance was also a big plus for thus film. Then and now and forever, this movie will have the same response and to the songs too. I would like to thank all those who are supporting the re-release of this Premikudu movie.

Actors: Indian Michael Jackson Prabhudeva, Nagma, S. P. Balasubramaniam, Girish Karnad, Vadivelu, Raghuvaran and others.

Technicians:
Production : Gentlemen Film International
Producers: Mega producer K. T. Kunjumon
Music: Oscar winner A. R. Rahman
Director: Sensational Director S. Shankar
World Wide Distributors: Muralidhar Reddy, Ramana
Distribution Company: CMR Productions
P R O: Madhu VR

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest