ఫైనల్ కు హైదరాబాద్ -రాజస్థాన్ ను ఇంటికి పంపిన వైనం

చెన్నై :

క్వాలిఫైయర్ -2 లో రాజస్థాన్ ను మట్టి కురిపించిన సన్ రైసర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరింది. ఫైనల్ లో కోల్కోత్త నైట్ రైడర్స్ తో తలపడనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ లో రాజస్థాన్ ను 36 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ కు దిగిన రాజస్థాన్ 139 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 42 పరుగులు చేశారు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు కొట్టాడు. యశస్వి దూకుడు చూస్తే రాజస్థాన్ గెలిచేలా ఉందనిపించినా హైదరాబాద్ స్పిన్నర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ బ్యాట్స్ మేన్స్ ఖంగుతిన్నారు. 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ పీకలోత్తు కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ధృవ్ 56 పరుగులు చెయ్యడంతో ఆ మాత్రం గౌరవమైన స్కోర్ దక్కిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరుకోవడం ఇది మూడోసారి. 2016లో ఛాంపియన్ గా , 2018లో రన్నరప్ గా నిలిచింది. 18పరుగులు చేసిన 3 వికెట్లు తీసిన షాబాజ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. కోల్కత్త తో హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest