బలగం మొగిలయ్యకు మెరుగైన వైద్యం చికిత్సను అందించాలి

వరంగల్ :

బలగం మొగులయ్య తీవ్ర అస్వస్థకు గురైన సమాచారం తెలుసుకొని తక్షణం స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు మొగులయ్యకు వరంగల్ లోని సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స ను జిల్లా వైద్య శాఖా అధికారుల ఆధ్వర్యంలో అందిస్తున్నారు.
బలగం సినిమా లో నటించి ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న నటుడు, బుడగ జంగాల కళాకారుడు బలగం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకొని అతని ఆరోగ్య పరిస్థితిపై మంత్రి వరంగల్ జిల్లా వైద్య శాఖ అధికారుల తో మాట్లాడారు మొగులయ్య కు డయాలసిస్ కి అవసరమైన మందులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందించారు. మొగిలయ్యా కు మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి (DMHO), ఎంజీఎం ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను ఆదేశించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest