నట సింహం బాలయ్య తాజాగా నటించిన ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
కొద్దిరోజుల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. నచ్చిన హీరో సినిమా అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే ఇటీవల విలేజ్, సిటీస్‌లో రచ్చ చేసే అభిమానులు కన్న ఫారిన్ లో అభిమానులు చేసే రచ్చతో కొత్త వివాదాలు తెరపైకి వస్తుండడంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటననే యుఎస్ లో జరిగింది.
మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా ను తెరకెక్కించాడు. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా అఖండ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బాలయ్య చాలాకాలం తర్వాత యాక్షన్ సినిమా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. బాలయ్య ద్వితీయ పాత్రలో నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో విడుదలైంది.veera simha reddy us stop the show balakrishna hangama
రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఈ సినిమా కోసం ఎలా ఎదురు చూస్తున్నారో, యూఎస్ లో ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలో సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు చేసిన హంగామా వివాదానికి దారితీసింది. ఓ థియేటర్లో బాలయ్య సినిమా మొదలవగానే అభిమానులు కాగితాలు చింపేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఫాన్స్ రచ్చ హద్దులు దాటేయటంతో అర్ధాంతరంగా సినిమా ని నిలిపివేసి గోల చేసిన వారిని థియేటర్ నుంచి బయటకు పంపించేశారు. ఇంతవరకు ఎన్నో సినిమాలను ప్రదర్శించామని అయితే ఎప్పుడు ఇలా జరగలేదని ఈసారి బాలకృష్ణ అభిమానులు రచ్చ చేశారని థియేటర్ యాజమాన్యం చెప్పుకొచ్చింది.