* ఆర్. ఆర్ క్రియేషన్స్ -పాలిక్ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం-1 చిత్రం ఆఖరి షెడ్యూల్
బాహుబలి` ప్రభాకర్ ప్రధాన పాత్రలో ఆర్. ఆర్ క్రియేషన్స్ -పాలిక్ స్టూడియోస్ బేనర్స్ పై పాలిక్ ( పాలిక్ శ్రీనివాస చారి) దర్శకత్వంలో రమేష్ రావుల నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రస్తుతం బూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆన్ లొకేషన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో బాహుబలి ప్రభాకర్ మాట్లాడుతూ…“ఒక అద్భుతమైన కథతో దర్శకుడు పాలిక్ ఈ చిత్రాన్ని తెకెక్కిస్తున్నారు. నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డైలాగ్స్ బాగా కుదిరాయి. నా పైన ఒక డిఫరెంట్ సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ అంతా పూర్తవుతుంది“ అన్నారు.
దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ…“దర్శకుడుగా ఇది నా 6వ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎంతో బిజీగా ఉన్నా ప్రభాకర్ ఎంతో సహకరిస్తున్నారు. ప్రస్తుతం రవి మాస్టర్ సారథ్యంలో ప్రభాకర్ గారి పై భారీ ఫైట్ బూత్ బంగ్లాలో చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్ రెండో రోజుల్లో పూర్తవుతుంది. దీంతో షూటింగ్ పూర్తయినట్లే. మా నిర్మాత రావుల రమేష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమా రిచ్ గా రావడానికి సహకరిస్తున్నారు. వింధ్య మంచి స్టోరి ఇచ్చారు. జాన్ భూషణ్ మూడు అద్భుతమైన పాటలిచ్చారు. ప్రభాకర్ గారి పై చాలా గ్రాండ్ గా ఒక పాట చిత్రీకరించాం. మార్చిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
నిర్మాత రమేష్ రావుల మాట్లాడుతూ…“ఈ రోజు భారీగా ప్రభాకర్ గారి పై ఫైట్ చిత్రీకరిస్తున్నాం. ప్రభాకర్ గారి సపోర్ట్ మరువలేనిది. మా డైరక్టర్ పాలిక్ మంచి ప్లానింగ్ తో సినిమాను అనుకున్న ప్రకారం పూర్తి చేస్తున్నారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి మార్చిలో సినిమా రిలీజ్ చేస్తాం“ అన్నారు.
కథా రచయిత వింధ్య రెడ్డి మాట్లాడుతూ…“నా కథను అద్భుతంగా పాలిక్ గారు తెరకెక్కిస్తున్నారు. రమేష్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ప్రభాకర్ గారి సహకారం వల్ల సినిమా అనుకున్న దానికన్నా బాగా వస్తోంది“ అన్నారు.
హీరో వెంకట్ మాట్లాడుతూ…“ ఈ చిత్రంలో హీరోగా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ “ అన్నారు.
హీరోయిన్ మోహన సిద్ధి మాట్లాడుతూ…“ఒక మంచి చిత్రంలో పార్ట్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నటీనటులుః
ప్రధాన పాత్రలోః బాహుబలి ప్రభాకర్
హీరోః రఘ, వెంకట్
హీరోయిన్ః మోహన సిద్ధి, పాయల్
జీవా, తాగుబోతు రమేష్.
గబ్బర్ సింగ్ బ్యాచ్
సాంకేతిక నిపుణులుః
కథః వింధ్య రెడ్డి
సినిమాటోగ్రఫీః గిరి, వెంకట్
ఫైట్స్ః రవి మాస్టర్
కొరియోగ్రఫీః పాలిక్ , మహేష్
సంగీతంః జాన్ భూషన్
లిరిక్స్ః సురేష్ గంగుల
పీఆర్వోః రమేష్ చందు
నిర్మాతః రమేష్ రావుల
స్కీన్ ప్లే-దర్శకత్వంః పాలిక్ ( పాలిక్ శ్రీనివాస చారి)
Post Views: 179