బిడ్డ మృతదేహంతో స్కూటీ పై 120 కిలోమీటర్లు ప్రయాణం

విశాఖపట్నం :
విశాఖపట్నంలో మానవత్వం మంటకలిసింది. చిన్నారి పాప అనే కనికరం కూడా లేకుండా విశాఖ పెద్ద ఆసుపత్రికి చెందిన వారు అంబులన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో చేసేదేమిలేక ఆ దంపతులు తమ కన్నా బిడ్డను స్కూటీపైనే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు.విశాఖ పెద్ద ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధేయ పడిన కేజీహెచ్ సిబ్బంది కనికరించలేదు. చివరికి గత్యంతరం లేక తల్లిదండ్రులు స్కూటీ పై పాడేరు కు ప్రయాణం అయ్యారు. దీంతో కేజీహెచ్ సూపర్డెంట్ , సిబ్బంది పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే అసలు విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పాడేరు నుండి స్వగ్రామానికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రుల ఆరోపించారు.అల్లూరిసీతారామరాజు జిల్లా కుమడ లో విషాదం నెలకొంది.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest