బ్యాటింగ్ బౌలింగ్ లోనూ విఫలమైన రోహిత్ శర్మ సేన

అహ్మదాబాద్ (గుజరాత్ ,19 నవంబర్ 2023 )
క్రికెట్ వరల్డ్ కప్ 2023 లో మొదటి మ్యాచ్ నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ టీమ్ ఇండియా ఫైనల్ లో పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ చతికిలపడ్డ రోహిత్ శర్మ సేన ఆస్ట్రేలియా టీమ్ ముందు చేతులెత్తేసింది. ఫలితంగా ఇండియ కు రావలసిన వరల్డ్ కప్ చేజారిపోయింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేద్ర మోడీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కోట్లమంది ప్రజలు చూస్తున్న ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా పర్ఫార్మెన్స్ అత్యంత దారుణంగా కనపడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లను ఇండియా బ్యాటర్స్ కట్టడి చేయలేకపోయారు. నిర్ణిత యాభై ఓవర్లలో టీమ్ ఇండియా ఆల్ అవుట్ అయింది. ఓపెనర్ దిగిన గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ అతి తక్కువ స్కోర్ ఉండగానే పెవిలియన్ దారి పట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ తెలివిగా ఆడలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ ఓపెనర్ గా కాకుండా రెండో, మూడో వికెట్ దిగితే బాగుండేదని అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కేవలం 47 పరుగులకే రోహిత్ శర్మ అవుట్ అవడంతో టీమ్ ఇండియా ఆత్మస్థైర్యం పై దెబ్బపడింది. గిల్ ను సింగిల్ డిజిట్ పరుగులు దాటకుండానే ఆస్ట్రేలియా బౌలర్లు ఇంటికి పంపించారు. విరాట్ కోహ్లీ (54) పరుగులు చేసి క్లిన్ బోల్డ్ అయ్యాడు. కె ఎల్ రాహుల్ (66) పరుగులు చేసి వెనుదిరిగాడు. మొత్తం టీమ్ ఇండియా లో ముగ్గురు మాత్రమే ఆటగాళ్లు రాణించారు. బ్యాటింగ్ లో టీమ్ ఇండియా పూర్తిగా విఫలమై 240 పరుగులు మాత్రమే చేయగలిగారు.
తర్వాత బౌలింగ్ వేసిన ఇండియా మొదట్లో కొంత దూకుడుగానే ఆడారు. షమీ, బుమ్రా లు మొదట్లోనే వికెట్లు తీశారు. వార్నర్ వికెట్ అతి తక్కువ స్కోర్ వద్ద పడిపోవడంతో ఇండియా టీమ్ లో కొత్త ఉత్సహం కనిపించింది. మొదట మూడు వికెట్లు త్వరగానే తీసినా తరువాత వికెట్లు తీయడంలో బౌర్లర్లు విఫలమైయ్యారు. దీంతో ఇండియా బౌలర్లను చిత్తు చేశారు. సెమీఫైనల్ లో ఏడూ వికెట్లు తీసిన షమీ ఆస్ట్రేలియా బ్యాట్స్ మేన్స్ ముందు చతికిల పడ్డాడు. రోహిత్ శర్మ టీమ్ ఫీల్డింగ్ లోనూ విఫలమైంది. ఫలితంగా చేతికి రావలసిన ప్రపంచ క్రికెట్ కప్ చేజారిపోయింది. ఇరవైఏళ్ళ తరువాత కంగారులతో తలపడ్డ ఇండియా సొంత గడ్డపై కంగారులను చేతిలో కృంగిపోయింది. చివరికి కోట్లాదిమంది భారత ప్రజలకు నిరాశ మిగిల్చింది. వచ్చే అయిదేళ్ల తరువాత ఈ టీమ్ లో ఎవరు ఆడతారో, ఎవరు కొత్త ముఖాలు ఉంటాయో వేచి చూద్దాం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest