మధిర
మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో సోనియా గాంధీ ప్రకటించిన అభయ హస్తం పథకాలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు,చేయూత,యువ వికాసం, కార్యక్రమాల గ్యారెంటీ కార్డును నాగులవంచ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇంటికి తిరుగుతూ ఐదు మండలాధ్యక్షులు, ఎంపిటిసిలు,సర్పంచ్ లు,అనుబంధ సంఘాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు
1. మహాలక్ష్మి
• మహిళలకు ప్రతినెలా 2500
• 500కే గ్యాస్ సిలిండర్
•ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
2 రైతు భరోసా
• ప్రతి ఏటా 15000 (రైతులు, కౌలు రైతులకు)
• 12000 (వ్యవసాయ కూలీలకు)
• వరి పంటకు 500 బోనస్
3. గృహ జ్యోతి
• ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
4. ఇందిరమ్మ ఇళ్లు
• ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ₹ 5 లక్షలు
• ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం
5. యువ వికాసం
• విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు
• ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్
6. చేయూత
• 4000 నెలవారీ పింఛను
• 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా