భువనేశ్వరమ్మ మహిళలకు ఆదర్శం : టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

 

కర్నూలు :

ఒక్క ఎంపీ సీటు కోసం సొంత బాబాయినే చంపేశారని, ఆ మాట జగన్ సొంత చెల్లే చెబుతోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కష్టాల నడుమ యువగళం పాదయాత్ర చేశారన్నారు. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర జరిగే సమయంలో భువనేశ్వరమ్మ ఒక తల్లిగా బాగా ఆందోళనకు గురయ్యారన్నారు. ఆ బాధను బయటికి చెప్పలేక లోలోపల మదన పడ్డారని పేర్కొన్నారు. భువనేశ్వరమ్మ మహిళలకు ఆదర్శమని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest