మంత్రి సబితా డిశ్చార్జ్ పిటిషన్ 28కి వాయిదా

హైదరాబాద్ , జూన్ 21 :

తెలంగాణ విద్య శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సబితా ఇంద్రారెడ్డి హోమ్ , గనుల శాఖా మంత్రిగా పని చేసిన సమయంలో జగన్ అక్రమాస్తుల ఆమె పేరు కూడా ఉంది. ఈ కేసు నుంచి తొలగించాలన్న సబిత పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్‌లో నిందితురాలిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. అయితే ఈ కేసునుంచి సబితా ఇంద్రారెడ్డి పేరును తొలగించవద్దని సీబీఐ వాదించింది. నిబంధనలకు విరుద్ధంగా పెన్నాకు గనుల కేటాయింపులో సబిత ప్రమేయం ఉందని సీబీఐ తెలిపింది. గనుల శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ చెప్పింది . ఛార్జిషీట్‌ నుంచి తనను తొలగించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థించిన నేపథ్యంలో
సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది .

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest