సుడాన్
సుడాన్ , ఆర్ ఎస్ ఎఫ్ బలగాల మధ్య మరో 72 గంటల పాటు కాల్పుల విరామం జరగాలని ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. కాల్పుల విరామాన్ని మరో 72 గంటల పాటు పొడిగించారు. ఈ విషయాన్నీ పారా మిలిటరీ ప్రకటించింది. ఈ గొడవల కారణంగా సుమారు పది వేల మంది ప్రజలు తమ తమ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు తరలివెళ్లినట్టు సమాచారం. అయితే ఇంతకు ముందు ఇరువర్గాలు అనుకున్నట్టు గురువారం సాయంత్రం 72 గంటల సమయం ముగుస్తోంది. దీంతో మరో 72 గంటల పాటు కాల్పుల విరమణ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఈ మేరకు రాజీ కుదిరింది.
Post Views: 140