సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ జీ5 & అభిషేక్ పిక్చర్స్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’ టీజర్ రిలీజ్
గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను గురువారం (ఏప్రిల్ 27)న సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించారు. సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీజర్‌ను గమనిస్తే… ఓ పల్లెటూరులోని ఇద్దరు పిల్లలు వారికి దగ్గరగా ఉండే కొండనెక్కి విమానాన్ని చూస్తుంటారు. అందులో ఓ పిల్లాడు మరో పిల్లాడితో ‘అరే మనం కూడా విమానంలో పోదాం రా’ అంటాడు. వారిద్దరూ విమానాన్ని చూడగానే సంతోషపడుతుంటారు. అసలు విమానం అంత ఎత్తు ఎలా ఎగురుతుందనే సందేహం కూడా వారిలో ఉంటుంది. అదొక్కటే కాదు.. విమానానికి సంబంధించి వారికి చాలా సందేహాలుంటాయి. వాటన్నింటినీ వారి గూడెంలోని వ్యక్తి (వెన్నెల కిషోర్)ని అడుగుతుంటారు. పిల్లల సందేహాలు తీర్చలేక అతని తల ప్రాణం తోకకొస్తుంటుంది. ‘విమానం కనిపెట్టిన రైట్స్ బ్రదర్స్‌కి కూడా ఇన్ని డౌట్స్ వచ్చుండవు. ఏం పీకుతార్రా విమానం గురించి తెలుసుకుని’ అని అసహనం వ్యక్తం చేస్తుంటాడు.
మరో వైపు ఓ ప్రేమ జంట (సంగీత్ శోభన్, శాన్వి మేఘన) సంతోషంగా ఉంటారు. అబ్బాయి, అమ్మాయి మధ్యలో మనస్పర్దలు, వాటికి కారణం ఏంటి? వారి ప్రేమని ఊరు అంగీకరిస్తుందా? చివరకు వారు విమానం ఎక్కి ఎందుకు పారిపోవాలని అనుకుంటుంటారు. వీరందరూ ఒకచోట చేరినప్పుడు ఏం జరుగుతుంది. అసలు విమానానికి వీరి జీవితాలకు సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఒక వైపు ప్రేమలోని మాధుర్యం, తెలియని విషయాలను తెలుసుకోవాలనే పిల్లల అమాయకత్వం వల్ల వచ్చే ఫన్, ఎంటర్‌టైనింగ్‌గా సాగే సన్నివేశాలు ఇవన్నీ ప్రేమ విమానంలో మిళితమై ఉన్నాయని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. బలమైన ఎమోషన్స్, చేజింగ్ సన్నివేశాల కలయికగా ఈ వెబ్ ఒరిజినల్‌ను సంతోష్ కటా తెరకెక్కించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి తర్వాత హీరో సంగీత్ శోభన్ నటిస్తోన్న భారీ చిత్రం ‘ప్రేమ విమానం’. అలాగే నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్, అనిరుధ్ తొలిసారి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన తొలి వెబ్ ఒరిజినల్ కూడా ఇదేకావటం విశేషం.
నటీనటులు :
సంగీత్ శోభన్, శాన్వె మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు
సాంకేతిక బృందం:
సమర్పణ : దేవాన్ష్ ; నామా నిర్మాత : అభిషేక్ పిక్చర్స్, జీ5 ; నిర్మాత : అభిషేక్ నామా; దర్శకత్వం : సంతోష్ కటా; సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్; సినిమాటోగ్రఫర్ : జగదీష్ చీకటి; ఎడిటర్ : అమర్ రెడ్డి; ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్; సీఈఓ : వాసు పోతిని; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహిత్ రాల్యని
జీ5 గురించి
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. ప్రేమ విమానం, వ్యవస్థ అనే రెండు కొత్త ప్రాజెక్ట్‌లతో ఆడియెన్స్‌ను ఆకట్టుకోబోతోంది.
‘ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిన అనుభవాలను చెప్పండి… బహుమతులను గెలుచుకోండి’ అంటూ ఆడియెన్స్‌ని ఆహ్వానిస్తోన్న ‘విమానం’ టీమ్
తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9 మూవీ రిలీజ్
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘విమానం’. విలక్షణ నటుడు సముద్ర ఖని ఇందులో వీరయ్య అనే మధ్య వయస్కుడి తండ్రి పాత్రలో నటించారు. ఇతని భార్య చనిపోయి ఉంటుంది. అంగ వైకల్యంతో బాధపడుతుంటాడు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. జూన్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
మనందరిలో విమాన ప్రయాణం అంటే తెలియని ఉద్విగ్నత ఉంటుంది. ముఖ్యంగా మన తొలి విమాన ప్రయాణాన్ని జీవితంలో మరచిపోలేం. ఆశ్చర్యపోయే విషయమేమంటే విమాపం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమా చేయక ముందు వరకు విమానంలో ఓసారి కూడా ప్రయాణించలేదు. ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడు తొలిసారి ఆయన ఆ అనుభూతిని పొందారు. తన తొలి విమాన ప్రయాణ అనుభూతి గురించి దర్శకుడు శివ ప్రసాద్ యానాల మాట్లాడుతూ ‘‘నేను విమానం సినిమా చేస్తున్నప్పుడు చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఎలా ప్రయాణించాలో తెలియలేదు. ఫ్లైట్ బోర్డింగ్ చేయటం, ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు ఎయిర్ పోర్టులో ఎక్కడ అడగాలి .. ఇలా చాలా సందేహాలు ఉండేవి. ఈ విషయం తెలిసిన జీ స్టూడియోస్ నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీని చిత్రీకరించటానికి ఓ వ్యక్తిని నియమించింది. ఈ విషయం తెలిసి నాకు ఇంకా టెన్షన్ మొదలైంది. విమానాన్ని దగ్గర నుంచి చూడగానే చాలా సంతోషమేసింది. ఆశ్చర్యంతో పాటు ఎగ్జయిట్‌మెంట్, తెలియని ఆనందం కలిగింది. ఇప్పటికీ నా తొలి విమాన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా చాలా సంతోషమేస్తుంది’’ అన్నారు.
ఈ నేపథ్యంలో విమానం నిర్మాతలు ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించారు. అలాగే ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బహుమతులను కూడా అందిస్తామని మేకర్స్ తెలియజేశారు.