మహేష్ బాబు సినిమా కోసం కాస్టింగ్ చేయడం లేదు

ఎస్ ఎస్ రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం కాస్టింగ్ చేస్తున్నట్టు ఓ పత్రికలో వచ్చిన ప్రకటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీ దుర్గ ఆర్ట్స్ నిర్మాత డాక్టర్ లక్ష్మి నారాయణ కాజా ఒక ప్రకటనలో తెలిపారు. మహేష్ బాబు , రాజమౌళి సినిమాకు సంబధించి కాస్టింగ్ జరుగుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. వీరేన్ స్వామి అనే వ్యక్తికి, ఈ ప్రాజెక్ట్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంబధించి ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా ప్రొడక్షన్ హౌస్ మాత్రమే విడుదల చేస్తుందని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest