ముగ్గురు పిల్లల మృతిపట్ల సీఎం దిగ్బ్రాంతి

హైదరాబాద్,

కరీంనర్ మానేరు వాగులో చనిపోయిన ముగ్గురు పిల్లల మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి రూ. 3 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నష్టపరిహారం చెక్కులను రేపు మంత్రి గంగుల కమలాకర్ అందించనున్నారు. మృతులు కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. గంగుల తరపున మరో 2 లక్షలరూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తామని గంగుల తెలిపారు. హోళి పండుగ రోజు ముగ్గురు పిల్లల మృతి చెందడం బాధాకరం అని అన్నారు.ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు.కరీంనగర్ జిల్లా అలుగునూర్ మానేర్ వాగులో రివర్ ఫ్రంట్ కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన తో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. హోలీ సంబరాలు చేసుకొని స్నానానికి అలుగునూర్ మానేర్ వాగులోకి వచ్చిన యువకులు ప్రమాదవశాత్తు మరణించారుమృత్తులంతా ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలానికి చెందినవారు, కరీంనగర్ లో తల్లిదండ్రులు వలస కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

మృతుల వివరాలు:
వీరాంజనేయులు 16
అనిల్ 14
సంతోష్ 13 సంవత్సరాలు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest