ముద్రగడ వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్ళరు

 

*టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత *

విశాఖపట్నం :

ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్ళరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు, పవన్‌ నిలబడ్డారని అన్నారు. గతంలో రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ సూచన చేశారని, మరిప్పుడు కాపులకు జగన్ రాజ్యాధికారం ఇస్తానన్నారా. ముద్రగడ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడొకలా ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహరించడం దారుణమన్నారు. ముద్రగడ వైసీపీ కోవర్ట్ అని కాపులకు తెలిసిందన్నారు. పోలీసులు – పరదాలు లేకుండా బయటికి రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి కాలికి బలపం కట్టుకుని తిరుగుతుందని, ముందు జగన్ ఆమెకు సమాధానం చెప్పాలని వంగలపూడి అనిత అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest