రాజ్ కోట్ :
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గేమింగ్ జోన్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో చాలామంది మృతి చెందినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో 27మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో 12 మంచి చిన్న పిల్లలు ఉన్నట్టు సమాచారం. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగింది. కొందరిని కాపరి ప్రయత్నం కూడా చేశారు. రెస్క్యూ టీమ్ చర్యలు తీకుకొంటోంది. అయితే ఇప్పటివరకు ఇరవై మృతదేహాలను బయటికి తీశామని రాజ్ కోట్ పోలిస్ కమిషనర్ రాజు భార్గవ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Post Views: 73