రామోజీరావుకు బుల్లితెర అశ్రునివాళి

బుల్లితెర నటీనటుల పాలిట రామోజీరావు దేవుడిలాంటివారని టివి ఆర్టిస్టులు అన్నారు.ఆయన మరణం టివి పరిశ్రమకు తీరని లోటని అన్నారు. టివి నటులు వినోద్ బాల, యాంకర్ సుమ , యాట సత్యనారాయణ ఇతర నటీనటులు, టివి సాంకేతిక నిపుణులు మాట్లాడారు. రామోజీరావు తో ఆయన నిర్మించిన సీరియల్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బుల్లితెర సీరియల్స్ ప్రారంభించడం వల్లే వేలాది మందికి ఫుడ్ దొరికిందని పలువురు నటీనటులు వ్యాఖ్యానించారు. సుమ , వినోద్ బాల, నాగబాల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest