రీ ఎంట్రీకి రెడీ అయిన ‘లత’

సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని, సినీ పరిశ్రమలో ఇప్పటికే పరిచయాలు ఉన్నవారైతే ఎలాగోలా నెట్టుకు రావచ్చు. కానీ ఎలాంటి పరిచయం లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి నిలబడడం అనేది ఒక రకంగా అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు నటి కం యాంకర్ లత. చిన్ననాడే సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత తన సుదీర్ఘ కెరియర్ లో సుమారు 150కి పైగా సినిమాలలో, పదుల సంఖ్యలో సీరియల్స్ లో కూడా నటించారు. అలాగే ఎన్నో షోలకు, స్టేజ్ షోలకు యాంకర్ గా వ్యవహరించారు. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఆమె మరోసారి సినీ రంగ ప్రవేశం కోసం సిద్ధమయ్యారు. నిజానికి ఆమె యాంకర్ గా కొంతమందికి తెలుసు, ఆర్టిస్ట్ గా కొంత మందికి తెలుసు. లత సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు, ఎన్నో స్టేజ్ షోలు కూడా చేశారు. కానీ పర్సనల్ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె అనేక సినిమాల్లో భాగమయ్యారు. ఆమె స్వస్థలం తెలంగాణలోని నాగార్జునసాగర్ కాగా ప్రతిరోజు అక్కడి నుంచి వచ్చి షూటింగ్స్ లో పాల్గొని మళ్ళీ తిరిగి వెళ్లేవారు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన లతా చాలా కాలం పాటు సినిమా పరిశ్రమలోనే 150 కి పైగా సినిమాలు, పదుల సంఖ్యలో సీరియల్స్ చేశారు. ఇప్పుడు ఆమె రీఎంట్రీకి రెడీ అయ్యాను. సాధారణంగా సినీ పరిశ్రమలోకి అమ్మాయిలు వెళుతున్నారు అనగానే వంద రకాల మాటలు వినిపిస్తూ ఉంటాయని, కానీ సినీ పరిశ్రమ ఒక కమర్షియల్ ఫీల్డ్ అని లతా అంటున్నారు. గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఇక్కడికి వచ్చి మేమేదో చేస్తున్నాం, తప్పు ఖచ్చితంగా జరుగుతోంది అని భావించే వాళ్ళు ఎక్కువమంది ఉంటారు. కానీ ఇక్కడ మేము వచ్చి నటులుగా, యాంకర్లుగా మా పని చేసుకుని మేము వెళ్ళిపోతాం కానీ అందులో తప్పేముందో మాకు అర్థం కావడం లేదు అంటున్నారామె. అన్ని రంగాలలో ఉన్నట్టుగానే సినీ రంగంలో కూడా మంచి, చెడు రెండు ఉన్నాయి కానీ ఎక్కువగా సినీ రంగం మీద ఉన్న చెడునే ఫోకస్ చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు సో సినీ పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆమె సలహా ఇస్తున్నారు. ఇక్కడ టాలెంట్ ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే గ్యాప్ తర్వాత నేను మళ్ళీ సినీ రంగ ప్రవేశం చేస్తున్నాను అని లత అంటున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest