దిల్లీ:
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది.
ప్రస్తుతం పంజాబ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 25 శాతాన్ని షెడ్యూల్డ్ కులాలకు, 12 శాతాన్ని ఓబీసీలకు కేటాయిస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్లను అదనంగా 13 శాతం పెంచి మొత్తం 25 శాతంగా చేయాలని ఎన్.సి.బి.సి. సూచించింది. అలా పెంచినా కూడా పంజాబ్లో మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితికి అనుగుణంగానే ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో ఓబీసీ జాబితాలో 143 కులాలు ఉన్నాయి. వాటిలో 83 కులాలు ముస్లిం వర్గానికి చెందినవే. ఇటీవల రాష్ట్ర ఓబీసీ జాబితాలో కొత్తగా 35 కులాలను చేర్చారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 17 శాతాన్ని ఓబీసీలకు కేటాయించారు. దీంతో పశ్చిమబెంగాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఓబీసీల రిజర్వేషన్లు 45 శాతానికి చేరాయి. ఇది సుప్రీంకోర్టు విధించిన పరిమితికి లోబడే ఉంటుంది.