లోకేశ్‌పై కేసు నమోదు… పిర్యాదు దారుడు సీఐ, ఎస్‌ఐ

అమరావతి :

 

నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ లోకేశ్‌తో పాటు పార్టీ నేతలు అమరనాథ్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, పులివర్తి నానిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బంగారుపాళ్యంలో శుక్రవారం నాటి ఘటనకు సంబంధించి ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు మేరకు 353, 188, 341 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అమరనాథ్‌రెడ్డి ఏ-1గా, పులివర్తి నాని ఏ-2గా, లోకేశ్‌ ఏ-3గా, దీపక్‌రెడ్డి ఏ-4గా చూపారు.

శుక్రవారం సీజ్‌ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన తమపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారన్న పలమనేరు రూరల్‌ సీఐ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది.

 

 

అమరావతి :

లోకేష్ ను కలిసిన కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రతినిధులు

• గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారా మెడిక్స్ శిక్షణను కొనసాగించాలి.
• కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు.
• తాము శిక్షణ పొందినట్లు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆధారం లేదు.
• దీంతో తరచూ ప్రభుత్వాధికారుల వేధింపులకు గురికావాల్సి వస్తోంది.
• కమ్యూనిటీ పారా మెడిక్స్ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలి.
• కమ్యూనిటీ పారా మెడిక్స్ ను ఫస్ట్ రిఫరల్ గా గుర్తించాలి.
• 104, 108 సర్వీసులలో సిపిలను నియమించాలి.
• అర్హులైన వారికి ఇళ్లస్థలాలు మంజూరు చేయాలి.
• కమ్యూనిటీ పారామెడిక్స్ కు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలి.
లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసింది.
• గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ పారామెడిక్స్ సేవలు వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.
• అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్యూనిటీ పారామెడిక్స్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest