హైదరాబాద్ :
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నుంచి సినిమా నటుడు , మాజీ మంత్రి బాబు మోహన్ పోటీ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ప్రకటించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబు మోహన్ తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో అయిన పొత్తు పొట్టుకోడానికి సిద్ధంగా ఉన్నాము. వరంగల్ నుండి బాబు మోహన్ పోటీ చేయనున్నారు. ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తాము. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుండి నేను పోటీ చేస్తున్నాను అని అన్నారు. నటుడు , మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ బీజేపీ నన్ను గత 5సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుని వాడుకున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న లక్ష్మణ్ లిస్టులో నా పెరులేకుండానే కేంద్రానికి పంపారు.
దేశం బాగుపడలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కె ఏ పాల్ తో కలసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరిన. కె ఏ పాల్ నేతృత్వంలో పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పాల్ సేవలు దేశానికి,రాష్ట్రానికి అందే విధంగా కృషి చేస్తా.
మోడీ ప్రభుత్వం వచ్చినాక దేశాన్ని అప్పుల ఊబిలో ముంచారు అని అన్నారు.