వాటర్ ట్యాంకులో శవం ఘటనపై సర్కారు సీరియస్ -విచారణకు ఆదేశం

నల్గొండ

@ నల్గొండ పట్టణంలో వాటర్ ట్యాంకులో శవం సంఘటనపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్రను విచారణ అధికారిగా నియమించిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన

@ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశం

“నల్గొండ పాతబస్తీ లోని వాటర్ ట్యాంక్ లో మనిషి శవం పడవేసిన సంఘటనపై అధికారిక ప్రకటన”
____________

@ సోమవారం (3.6.2024)న నల్గొండ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు వాటర్ లైన్ మెన్లు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీలోని 28 వ వార్డు లో ఉన్న వాటర్ ట్యాంక్ పరిశుభ్రం కోసం తనిఖీ చేయగా శవం కనిపించింది.

@ ఈ శవం నల్గొండ పాత బస్తికి చెందిన 27 సంవత్సరాల ఆవుల వంశీకృష్ణదిగా గుర్తించడం జరిగింది

@ మున్సిపల్ సిబ్బంది మే 30 వ తేదీన మరియు జూన్ 1 న వాటర్ ట్యాంక్ ను తనిఖీ చేసి నీటిని విడుదల చేయడం జరిగింది
@ అప్పుడు వాటర్ ట్యాంకులో ఎలాంటి శవం కనపడ లేదు

@ వాటర్ ట్యాంక్ ను ప్రతి 2,3 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు శుభ్రపరచడం జరుగుతున్నది

@ అంతేకాక నిబంధనల ప్రకారం ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకు శుభ్రం చేసే షెడ్యూలు ఇవ్వడం జరిగింది

@ ప్రాథమిక వైద్య విచారణలో చనిపోయిన శవం 2-3 రోజుల ది గా గుర్తించడం జరిగింది.

@ పూర్తి పోస్ట్ మార్టం కొనసాగుతున్నది

@ శవం పై అక్కడక్కడ గాయాలను గుర్తించడం జరిగింది

@ చనిపోయిన వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి, గత నెల 24 నుండి కనిపించడం లేదని తెలిసింది

@ ఈ కేసును పోలీసులు హత్య, ఆత్మహత్య వంటి వివిధ కోణాలలో పరిశీలిస్తున్నారు.

@ వాటర్ ట్యాంకులో శవం లభ్యమైన సంఘటనపై నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నల్గొండ పాతబస్తీలోని 28వ వార్డు ను సందర్శించి 50 ఇండ్లను సందర్శించడం జరిగింది.

@ అక్కడ ప్రజలకు తాగునీటి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదని గుర్తించడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest