వామ్మో…. కృష్ణమ్మ కు బ్రేక్ ఈవెన్ వచ్చిందట?

అబద్దాలు చెప్పడంలో సినిమా వాళ్లు నెంబర్ వన్ స్థానంలో ఉంటారని ఓ నానుడి. ఇది ఇప్పుడు నిజమేననిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్(Andhrapradesh), తెలంగాణ(telangana) లో చిన్న సినిమాలకు ఒకపక్క జనమేలేరని థియేటర్లు మూసివేసే పరిస్థితి రాగ ”కృష్ణమ్మ” (krishnamma) సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ అయిందని ఈ సినిమా నిర్మాతలు ఓ పోస్టర్ విడుదల చేశారు. నిజానికి ఇది చిన్న సినిమానే. ఇందులో చెప్పుకోదగ్గ స్టార్స్, లేదా జనాలకు బాగా తెలిసిన యాక్టర్స్ ఎవరు లేరు. అయినా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ (break even) వచ్చింది అంటే ఆంధ్ర, తెలంగాణ లో థియేటర్లు మూసెయ్యాల్సిన అవసరం ఏమిటి ? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. కృష్ణమ్మ సినిమాకు బ్రేక్ ఈవెన్ వచ్చి ఉంటె సంతోషమే, మరి అలాంటాప్పుడు ఆంధ్ర, తెలంగాణ మొత్తం థియేటర్లలో ఇదే సినిమా నడిపించి ఉండొచ్చుకదా అని ఓ పెద్ద నిర్మాత వ్యాఖ్యానించారు. తెలంగాణ లో సినిమా థియేటర్లు మూసి వేస్తున్నామని అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే కృష్ణమ్మ సినిమా బ్రేక్ ఈవెన్ వచ్చిందని పోస్టర్ విడుదల కావడం ఆసక్తికరమైన అంశం. హనుమాన్ సినిమా తరువాత డీజే టిళ్లు -2 సినిమా మాత్రమే నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టాయని నిర్మాతల మండలి కార్యదర్శి, సినిమా ట్రేడ్ ఎనలిస్ట్ ప్రసన్న కుమార్ టి29న్యూస్ తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. మరి ఈ మధ్య విడుదలైన కృష్ణమ్మ సినిమాకు సైతం జనం రాలేదని ఫిలిం నగర్ టాక్. ఇలాంటి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 4. 50 కోట్లు గ్రాస్ వచ్చిందని, బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పుకోవడం నమ్మశక్యం కానీ విషయంగా ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమాకు మొత్తం అయిన ఖర్చు ఎంత ? ఈసినిమాలో ఉన్నస్టార్స్ ఎవరు? ఎన్ని రోజులకు బ్రేక్ ఈవెన్ వచ్చింది ? వంటి చర్చలు ఫిలిం నగర్ లో చాలా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ గడ్డు పరిస్థితుల్లో నిజంగానే కృష్ణమ్మ సినిమాకు బ్రేక్ ఈవెన్ వచ్చి ఉంటె ఈ సినిమాను డీజే టిళ్లు -2  (DJ Tillu -2) తరువాత హిస్టరీలో రాసుకోవలసిందే. సత్యదేవ్ (sathyadev)హీరోగా నటించిన ఈ సినిమాకు వివి గోపాలకృష్ణgopalakrishna) దర్శకుడు. కానీ ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ(koratala shiva) సమర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest