న్యూ ఢిల్లీ
వ్యాపార దిగ్గజం అమెజాన్ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొరోనా సమయం నుంచి మొదలు కొని ఇప్పటివరకు ఇంటినుంచే (వర్క్ ఫ్రొం హోమ్ ) పని చేస్తున్నారు. అయితే తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయం ప్రకారం వారానికి మూడు రోజులు ఖచ్చితంగా సిబ్బంది ఆఫీస్ కు వచ్చి పని చేయాల్సిందేనని నిబంధన పెట్టింది. ఈ నిబంధనను మే 1 నుంచి అమలు చేస్తామని కూడా అమెజాన్ ప్రతినిధుల్లో ఒకరైన జెస్సి వెల్లడించారు. వర్క్ ఫ్రొం హోం విధానానికి స్వస్తి పలకాలని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రొం హోమ్ పెరిగింది. కానీ మారుతున్న పరిస్థితులకనుగూణంగా సిబ్బంది కనీసం వారానికి మూడు రోజులు కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించాల్సి ఉంటుందని జెస్సి తెలిపారు. ఇప్పటికే వర్క్ ఫ్రొం హోమ్ చాలా కాలమైందని ఆయన పేర్కొన్నారు.
Post Views: 180