హైదరాబాద్: విచారణకు సోమవారం హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. 41ఏ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. సీబీఐకి సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరవుతా. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరుకాలేను. 41ఏ నోటీసులు ఇవ్వడం సబబు కాదు. గతంలో సెక్షన్ 160 ద్వారా నోటీసు ఇచ్చారు. గత నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధం. సెక్షన్ 41ఏ ద్వారా ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అనేక ప్రశ్నలకు తావిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
Post Views: 105