విధి నిర్వహణలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో పోలీస్ కమిషనర్ సూచనలు

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలోని సైబరాబాద్, రాచకొండ, నిజామాబాద్, సిద్దిపేటకు చెందిన (268) SCTPCలు AR (మహిళలు) మరియు (17) PTO – తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి డ్రైవర్లు మరియు మెకానిక్‌లు MBLC(METRO BARRACK LEARNING CENTRE) చెలాపురా మరియు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, పేట్లబుర్జ్‌ హైదరాబాద్‌లో (09) నెలల బేసిక్ ఇండక్షన్ శిక్షణ కొరకు రిపోర్ట్ చేయడం జరిగింది.

21.02.2024 నాడు SCTPCలు AR (మహిళలు) మరియు (17) PTO డ్రైవర్లు మరియు మెకానిక్‌లకు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన  “K శ్రీనివాస రెడ్డి, IPS, పోలీస్ కమిషనర్, హైదరాబాద్ సిటీ  మరియు గౌరవనీయులైన  V సత్యనారాయణ, IPS Jt.కమీషనర్ ఆఫ్ పోలీస్, CAR హెడ్‌క్వార్టర్స్ మరియు ట్రైనింగ్స్, హైదరాబాద్ సిటి  మరియు ఇతర హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులు హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి   “K శ్రీనివాస రెడ్డి, IPS,  కొత్తగా రిక్రూట్ అయిన SCTPC లను ఉద్దేశించి మాట్లాడుతూ “లక్షలాది మంది అభ్యర్థుల మధ్య పోటీ పడి మీరందరూ చాలా కస్టపడి ఈ ఉద్యోగం సంపాదించి పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు, ఎంపికైన మీరందరూ శిక్షణ నిమ్మితం ఇక్కడకు వచ్చారు. భవిష్యత్తులో మీరు చేయబోయే దాదాపు 35 సంవత్సరాల సర్వీసు కాలంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు, సమాజంపై పూర్తి అవగాహన పెంపొందించే విధంగా ప్రజల ఆస్తులను కాపాడాలని మరియు విధి నిర్వహణలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మంచి సూచనలు ఇచ్చారు, అదే విదంగా అంతర్గతంగా ఎదురయే సమస్యలని ఎదురుకోవడానికి, శాంతిని కొనసాగించడానికి మనమందరం కూడా శాయశక్తులా వృత్తి ధర్మాన్ని పాటించాలని వివరించారు”.

ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆఫీస్ టైంకి విధులు నిర్వర్తించి వెళ్ళిపోతారు కానీ మన పోలీస్ వారు 24 గంటలు ప్రజల ధన మాన ప్రాణ ఆస్తుల రక్షణ కోసం శాయశక్తులా కృషి చేస్తారు కావున ఇందులో పాలు పంచుకోడానికి మీరు ఈ డిపార్ట్మెంట్ లోకి చేరడం ఎంతో అదృష్టం చేసుకున్నారు, మీరు వృత్తి ధర్మాన్ని క్రమ శిక్షణ తో, సమయపాలన పాటిస్తూ, కమిటీట్మెంట్ తో విధులు నిర్వర్తిస్తూ ఇటు పోలీస్ శాఖకు మరియు తల్లి తండ్రులకు చక్కటి పేరు తీసుకరావాలని కోరుతున్నాను.

అలాగే శారీరక దృఢత్వం, మానసిక శక్తి కోసం ఆరోగ్యం ఫై ద్రుష్టి సారించాలని కోరుకుంటు మీయొక్క భవిషత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటి పోలీస్ కి సంబంధించిన డి.సి.పి లు, ఎ.సి.పి లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest