వెస్ట్ ఇండీస్ పై ఇండియా విజయం-100 వికెట్లు తీసిన ఘనత దీప్తి శర్మ

హైదరాబాద్ :
మహిళల టి 20 ప్రపంచ కప్ లో వెస్ట్ ఇండీస్ పై ఇండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసి విజయం సాధించింది. హర్మాన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని టీమ్ ఇండియా బౌలర్లు దీప్తి శర్మ ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసింది. పూజ, రేణుక సింగ్ చెరో వికెట్ ను పడగొట్టారు. దీంతో మహిళల జట్టు ఖాతాలో రెండో విజయం చేరింది. హర్మాన్ ప్రీత్ కౌర్ 33 పరుగులు, రిచా గోస్ 44పరుగులు చేసి భారత్ ను విజయతీరానికి చేర్చారు. వీరిద్దరూ చివరి వరకు మ్యాచ్ నడిపించారు.

గ్రేట్ దీప్తి
అంతర్జాతీయ టి 20 క్రికెట్ లో 100 వికెట్లు తీసిన ఘనత దీప్తి శర్మ సొంతం చేసుకుంది. 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా చరిత్రకెక్కింది. ఇంతకు ముందు 98 వికెట్లు తీసిన రికార్డ్ పూనమ్ యాదవ్ కు ఉంది పురుషుల క్రికెట్ లో కూడా యుజ్వేంద్ర చాహల్ 91 వికెట్లు తీయగా, భువనేశ్వర్ 90 వికెట్లు తీసిన రికార్డ్ ఉంది. కానీ దీప్తి ఏకంగా 100 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ దీప్తి ఆడిన 89వ అంతర్జాతీయ టి 20 మ్యాచ్ .

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest