రాజమహేంద్రవరం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు వేదిక ఖరారయ్యింది.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో గల కడియం మండలం వేమగిరి నాలుగు లైన్ల జాతీయరహదారి పక్కన గల స్థలంలో ఈ మహనాడు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 38 ఎకరాల విస్తీర్ణం గల ఈ స్థలంలో మహానాడు నిర్వహించడానికి నిర్ణయించారు.ఎందుకంటే ఈ జాతీయ రహదారిని ఆనుకొని సుమారు 100 ఎకరాల ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. అవి పార్కింగ్‌గా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆధ్వర్యంలో ఈ వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి.అయితే ఈనెల 29న పార్టీ పెద్దలు ఈ ప్రదేశానికి వచ్చి అధికారికంగా వెల్లడిస్తారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. 2006 మే 27,38,29 తేదీలలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఈ మహానాడు జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహానాడు వచ్చే నెలాఖరుల్లో జరగనుంది. ఈ మహానాడుకు పలు ప్రదేశాలు పరిశీలించినప్పటికీ వేమగిరి లోనే అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకున్నట్లు బుచ్చయ్య చౌదరి వెల్లడించారు.రాజమహేంద్రవరం నగరంతో సంబంధం లేకుండా అన్ని రహదారులుకు ఈ ప్రదేశం అనుసంధానం ఉంటుంది.ట్రాఫిక్ సమస్యలు అంతగా ఉండవు.ఈ గ్రౌండ్ చాలా మంది టిడిపి శ్రేణులకు తెలిసిందే.2015లో అప్పటి మచిలీపట్నం ఎంపి కొనగళ్ల నారాయణ కుమారుడి వివాహం ఇక్కడే జరిగింది. అప్పుడు బాలకృష్ణతో పాటు టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలు,నాయకులు పెద్ద ఎత్తున విచ్చేశారు. అందువల్ల ఈ గ్రౌండ్ అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని పార్టీ నాయకులు తెలుపుతున్నారు.