సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం

హైదరాబాద్

సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి. తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం. సీఎం పుట్టిన రోజునే (ఫిబ్రవరి 17న) కొత్త సచివాలయ ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలి.ఫైర్ సేఫ్టీసహా అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి అని బండి సంజయ్ అన్నారు .

విశ్వనాథ్  కు సంతాపం

ప్రముఖ సినీ దర్శక  దిగ్గజం, కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, పద్మశ్రీ కె. విశ్వనాథ్ మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ  బండి సంజయ్ కుమార్ తీవ్ర సంతాపం తెలిపారు.సంస్కృతీ సంప్రదాయ విలువలకు, సంగీతానికి పెద్దపీట వేస్తూ తెలుగు సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి విశ్వనాథ్ అని కొనియాడారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొన్నారు.భారతీయ సినిమా ఉన్నంత కాలం కె. విశ్వనాథ్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు.కె. విశ్వనాధ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest