అమరావతి :
సాంప్రదాయ వైద్యం పై రాష్ట్రప్రభుత్వానికి ఎందుకు ఆశక్తి లేదో ప్రజలకు అర్ధం కావడంలేదు ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పందించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు భహిరంగ లేఖ విడుదల చేసారు. ముఖ్యమంత్రి కనీసం అసెంభ్లీ వేదికగా నైనా సమాధానం చెప్పాలి. ప్రపంచానికి వైద్యశాస్త్రాన్ని అందించిన భారత ఖండం ఖ్యాతిని తెలుసుకోండి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకోండని హితవు పలికారు. తరతరాలుగా దేశీయ సాంప్రదాయ వైద్యం విశ్వవిఖ్యాత మైతే ముఖ్యమంత్రి ఎందుకు సుముఖంగా వ్యవహరించడంలేదో అర్ధం కాని పరిస్థితి నేడు ప్రభుత్వం వ్యవహార శైలిని బట్టి కనపడుతోంది.ఆయుర్వేదం , సిద్దా , యునాని , హోమియోపతి , నాచురోపతి మొదలైన వైద్య విధానాలు ఎన్నో వ్యాధులను వాటి మూలాలను నివారించే దిశగా సమవర్ధవంతంగా పనిచేసే పరిస్థితులు ఉన్నా రాష్ట్రప్రభుత్వానికి వాటిపై కనీస శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరం. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక్క సారి కూడా ఈ శాఖలపై సమీక్ష నిర్వహించకపోవడం పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం.ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి త్వరితగతిన ఆయా శాఖల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. వైరస్ ల వల్ల అనేక ఆరోగ్యపరమై న ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపత్కర సమస్యల ఎదుర్కొంటున్న దశలో అత్యధిక జనసాంధ్రత కలిగిన ఈ రాష్ట్రంలో అన్ని రకాల వైద్యవిధానాలు అందుబాటులోకి తీసుకుని రావలసిన భాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. సాంప్రదాయ వైద్యవిధానాల పట్ల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడనాడాలని ముఖ్యమంత్రి కి రాసిన బహిరంగ లేఖలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విషయాలను ప్రస్తుతించారు