‘సీతా కళ్యాణ వైభోగమే’ సినిమాను థియేటర్లో చూసి ఆదరించండి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హర్షిత్ రెడ్డి

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం నాడు నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో

హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మై ఫ్రెండ్ టైంలోనే సతీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ మూవీ ఐడియాను ఏడాదిన్నర క్రితమే చెప్పాడు. సుమన్ అనే కొత్త కుర్రాడు, యంగ్ టాలెంట్‌తో చేస్తున్నానని అన్నాడు. సుమన్ ఫస్ట్ ఫిల్మ్, సతీష్ రెండో చిత్రానికి ఆల్ ది బెస్ట్. నీరూస్ సంస్థకు ఆల్ ది బెస్ట్. రాచాల యుగంధర్‌కు ఆల్ ది బెస్ట్. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘టైటిల్ చాలా బాగుంది. మన తెలుగు సంప్రదాయాన్ని చాటేలా ఉంది. మంచి చిత్రం తీసిన యుగంధర్ గారికి మంచి విజయం దక్కాలి. సతీష్ చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఊరికి ఉత్తరాన సినిమా నాకు నచ్చింది. ఈ సినిమాతో సతీష్‌కు పెద్ద విజయం దక్కాలి. సుమన్, గరిమ ఇద్దరూ చక్కగా నటించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. వారిద్దరికీ ఆల్ ది బెస్ట్. గగన్ విహారి మంచి నటుడిగా ఎదుగుతున్నారు. 21న రాబోతోన్న ఈ సినిమాను అందరూ చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘మా సినిమా పాటలు టీ-సీరిస్ ద్వారా రిలీజ్ అయ్యాయి. మా ట్రైలర్ అందరికీ నచ్చింది. హర్షిత్ రెడ్డి గారు బలగం సినిమాతో బలాన్ని ఇచ్చారు. హర్షిత్ రెడ్డి గారి కజిన్ సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. చరణ్ అర్జున్ గారు మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్ గారికి సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉంది. కొందరికి తాతలు, ముత్తాతల పేర్లు కూడా తెలీదు. కానీ రాముడి గుడి లేని ఊరు ఉండదు. ఆయన బతికిన విధానం వల్లే అందరికీ గుర్తుండిపోయారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశాను. నీరూస్ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ అన్నకి థాంక్స్. ఈ చిత్రం 90s కిడ్స్ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ ప్రయాణంలో మాకు అన్ని రకాల ఎమోషన్స్ ఎదురయ్యాయి. మా ఈ ప్రయాణంలో మేం రెండు చిత్రాలు చేశాం. ఆ రెండూ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. మేం పడిన కష్టాన్ని చూసేందుకు థియేటర్‌కు రండి. నీరూస్ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేమ’ని అన్నారు.

నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హర్షిత్ గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. చిన్న చిత్రంగా మొదలైనా.. పెద్ద సినిమాగా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో గగన్ విహారి అద్భుతంగా నటించారు. ఊరికి ఉత్తరాన సినిమాతో సతీష్ గారు విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. సుమన్ తేజ్, గరిమలకు ఈ చిత్రంతో మంచి పేరు రాబోతోంది. పూర్ణాచారి గారు పాటలు అద్భుతంగా రాశారు. జూన్ 21న మా సినిమా రాబోతోంది.ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

గగన్ విహారి మాట్లాడుతూ.. ‘సతీష్ గారు నాకు మంచి కారెక్టర్ ఇచ్చారు. పాత్రల మధ్య జరిగే కథ ఇది. చాలా బలమైన ఎమోషన్స్ ఉంటాయి. అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా లాంటి కొత్త వారిని నమ్మి సినిమా తీసిన యుగంధర్ గారికి థాంక్స్. సుమన్, గరిమలతో నటించడం ఆనందంగా ఉంది. జూన్ 21న రాబోతోన్న మా చిత్రాన్ని అందరూ వీక్షించండి’ అని అన్నారు.

గరిమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘మాలాంటి కొత్త వాళ్లని నమ్మి, ఛాన్స్ ఇచ్చిన నిర్మాత యుగంధర్ గారికి థాంక్స్. సతీష్ గారు ప్రతీ సీన్‌ను ఎంతో బాగా వివరించేవారు. పరుశురామ్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. చరణ్ గారు మంచి పాటలు ఇచ్చారు. సుమన్ తేజ్‌తో నటించడం ఆనందంగా ఉంది. గగన్ విహారి అద్భుతంగా నటించారు. మా సినిమా జూన్ 21న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ‘టీ-సిరీస్ ద్వారా మా సినిమా పాటలు రిలీజ్ అయ్యాయి. ప్రతీ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సతీష్ గారు తీసిన ఈ మంచి చిత్రం హిట్ అవ్వాలి. నిర్మాత యుగంధర్ గారి పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాలి. జూన్ 21న మా సినిమా విడుదల అవుతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

సత్య నారాయణ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ టైటిల్ చాలా బాగుంది. సతీష్ గారు చాలా మంచి డైరెక్టర్. యేలా యేలా అనే పాట కోసమే ఇక్కడకు వచ్చాను. రాసిన పూర్ణాచారి, పాటను కంపోస్ చేసి చరణ్ అర్జున్ గారికి ఆల్ ది బెస్ట్. ఈ ప్రయాణంలో సినిమా టీం పడ్డ కష్టం నాకు తెలుసు. సుమన్ అద్భుతమైన నటుడు. గరిమ, గగన్ విహారి చక్కగా నటించారు. ఈ చిత్రం జూన్ 21న విడుదల కాబోతోంది. మీడియా సపోర్ట్ చేసి ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా చేయాలి. మా నిర్మాత యుగంధర్‌కు మంచి విజయం దక్కాలి’ అని అన్నారు.

నీరూస్ ప్రతినిధి ఆసిం మాట్లాడుతూ.. ‘సతీష్‌తో మాకు మంచి అనుబంధం ఏర్పడింది. యుగంధర్ గారు చాలా మంచి వ్యక్తి. సుమన్, గరిమ, గగన్ చాలా అద్భుతంగా నటించారు. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.

దేవరాజ్ పాలమూరి మాట్లాడుతూ.. ‘సీతా కళ్యాణ వైభోగమే సినిమా బాగా వచ్చింది. టైటిల్‌తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్‌ ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. జూన్ 21న ఈ చిత్రం రానుంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు.

నటుడు రమణా రెడ్డి మాట్లాడుతూ.. ‘సీతా కళ్యాణ వైభోగమే సినిమాను చూశాను. చాలా బాగుంది. అందరూ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించబోతోంది. జూన్ 21న ఈ మూవీ రాబోతోంది. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ చిత్రమిద’ని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest