మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న అమేజాన్ ప్రైమ్ మరియు ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సుడిగాలి సుధీర్ మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ `గాలోడు`.
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన `గాలోడు` సినిమా భారీ అంచనాలతో థియేటర్స్‌లో రిలీజై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. సుధీర్ కెరీర్‌లోనే మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అయిన అమేజాన్ ప్రైమ్ మరియు ఆహాలో ప్రసారం కానుంది. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల దర్శకత్వం వహించారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
గాలోడు కథేమిటంటే…
రజనీకాంత్ అనే యువకుడు ఏ పని పాట లేకుండా ఊరిలో జులాయిగా తిరుతుంటాడు. దాంతో అందరూ అతన్ని గాలోడు అంటుంటారు. అనుకోకుండా ఓ మర్డర్ కేసులో చిక్కుకున్న అతడు ఆ నేరం నుంచి ఎలా బయటపడ్డాడు? శుక్ల (గెహానా సిప్పీ) అనే అమ్మాయి ప్రేమను ఎలా సొంతం చేసుకున్నాడన్నదే ఈ సినిమా కథ.
సప్తగిరి, పృథ్విరాజ్, శకలక శంకర్, సత్య క్రిష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు.
సినిమాటోగ్రఫి: సి రాం ప్రసాద్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సమర్పణ: ప్రకృతి
బేనర్: సంస్కృతి ఫిలింస్,
రచన – దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.