హైదరాబాద్:
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ‘‘వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగింది. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని.. లేదా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని కోరుకున్నారు. వివేకా రాజకీయ కదలికలు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి నచ్చలేదు. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు కనిపిస్తోంది. హత్య జరిగిన రాత్రి వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్ వెళ్లాడు’’ అని కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది.
Post Views: 195