న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 ::
సూడాన్ లో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ కావేరి లో భాగంగా తెలంగాణా కు చెందిన 17 మంది న్యూఢిల్లీ లోని పాలెం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు నేడు చేరుకున్నారు. ఈ 17 మందికి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ స్వాగతం పలికారు. కాగా గురువారం నాడు సూడాన్ ముంబయి ఎయిర్ పోర్ట్ కు 14 మంది చేరుకున్నారు. ఇప్పటికీ మొత్తం 31 మంది తెలంగాణా వాసులు తిరిగి వచ్చారు. కాగా, న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ లైన్ కౌంటర్ ద్వారా కొందరిని హైదరాబాద్, ఇతర స్వస్థలాలకు పంపించడంతో పాటు మరి కొందరికి తెలంగాణ భవన్ లో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు.
Post Views: 172