సైబర్ నేరగాడి అరెస్టు

గన్నవరం:

పత్రికా ప్రకటన

సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ – గన్నవరం

సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులపై విద్వేషపూరిత పోస్టులు చేస్తూ, వివిధ రాజకీయ మరియు సామాజిక పక్షాల మధ్య విద్వేషాలను పురికొల్పే విధంగా ప్రవర్తిస్తున్న సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన గన్నవరం పోలీసులు.

✅గన్నవరం ఇన్స్పెక్టర్ కనకారావు కి అందిన ఫిర్యాదు మేరకు గన్నవరం రామానగర్ ప్రాంతానికి చెందిన పొందూరు అంజన్ @ అంజన్ చౌదరి అను వ్యక్తి FACE BOOK,TWITTER, INSTAGRAM ఖాతాలలో అంజన్ # యువగళం అను అకౌంట్ ద్వారా ప్రముఖ వ్యక్తుల పైన విద్వేషపూరిత పోస్టులు పెడుతూ మరియు ప్రజా ప్రతినిధులపై ద్వేషం, అసత్యాలతో కూడిన సందేశాలను పోస్ట్ చేయడం ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించుచుండగా పోలీసు వారు వలపన్ని ఇతనిని అదుపులోనికి తీసుకోవడం జరిగింది.
✅ఇతని తండ్రి సాంబశివరావు (రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్), తల్లి రత్నకుమారి (రిటైర్డ్ టీచర్) గా గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసి పదవి విరమణ చేసి ఉన్నారు.
✅ఈ నేరగాడి వయసు 34 సంవత్సరాలు ఇతను అమెరికాలో టార్గెట్ కార్పొరేషన్ కంపెనీ నందు 3 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి 2015 సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చాడు.
✅అప్పటినుండి జులాయిగా తిరుగుతూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టుల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించుచున్నాడు.

✅ఇతను మద్యపానానికి బానిసై తరచుగా తల్లిదండ్రులను హింసించి ప్రతిరోజు చెడు వ్యసనాలకు డబ్బు కోసం తల్లిదండ్రులను మరియు స్నేహితులను పీడించుచున్నాడు.

✅ఇతని వద్ద సదరు నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, ట్యాబ్ తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పరికరాలను పోలీసు వారు జప్తు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఫారెన్సీక్ సైన్స్ లాబరేటరీకి పంపించడం జరిగినది.
✅ఇతడు స్వభావరిత్యా స్వలింగ సంపర్కుడు. ఇతని ఫోన్, టాబ్ లో ఉన్న వందలకొద్ది గే – వీడియోలను (Gay Videos)చూసి పోలీసు వారే విస్తు పోయారు.
✅ఇతను టిండర్ క్రెడిట్, క్యూపిడ్, గ్రిండర్, క్లబ్ హౌస్ మొదలగు డేటింగ్ యాప్ల ద్వారా గే ( పురుష స్వలింగ సంపర్కులతో ) సంబంధాలు నడుపుచు తరచుగా వారితో నగ్న వీడియో కాల్స్ మరియు అసంబద్ధ లైంగిక సంబంధాలకు అలవాటు పడి యున్నాడు.
✅అంతేకాకుండా అనేక చెడు వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను స్నేహితులను డబ్బు కోసం హింసించటమే కాక ప్రముఖ వ్యక్తులకు పరువునష్టం కలిగిస్తూ శాంతిభద్రతలకు విగాథం కలిగించే విధంగా ప్రవర్తించుచున్నందున పోలీసు వారు అదుపులోనికి తీసుకొని తగిన చట్టపరమైన చర్యలకు న్యాయస్థానంలో ప్రవేశ పెట్టడం జరిగింది. కేసు సైబర్ నిపుణుల ఆధ్వర్యంలో విచారణలో ఉన్నది.
✅ఇతనిపై సైబర్ బుల్లి షీట్, చేసి నిరంతర నిఘా ఉంచడం జరుగుతుంది అని గన్నవరం డిఎస్పి గారు పత్రిక ముఖంగా తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest