స్పార్క్’ మూవీ సక్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్:  హీరో విక్రాంత్‌

విక్రాంత్, మెహరీన్, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించటమే కాకుండా ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే కూడా అందించారు. గురు సోమ‌సుంద‌రం ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టించారు. ఇంకా ఈ మూవీలో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, బ్ర‌హ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అన్న‌పూర్ణ‌మ్మ‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వంబ‌ర్ 17న

స్పార్క్ మూవీ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా…

హీరోయిన్ రుక్స‌ర్ థిల్లాన్ మాట్లాడుతూ ‘‘మా ‘స్పార్క్’ మూవీ సక్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌. హీరో విక్రాంత్‌కి అభినంద‌న‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎందుకంటే ఇదొక ఎక్స్‌పెరిమెంట్ మూవీ. త‌ను హీరోగా న‌టిస్తూనే సినిమాను డైరెక్ట్ చేశారు. క‌థ‌, స్క్రీన్ ప్లే కూడా అందిస్తూ కీల‌క‌మైన పాత్ర‌ను పోషించారు. త‌న డేడికేష‌న్‌తో విక్రాంత్ ఈ రోల్స్‌ను స‌మ‌ర్దవంతంగా పోషించారు. నేను సంధ్య థియేట‌ర్‌లో ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూశాను. అంద‌రికీ ఓ డిఫ‌రెంట్ ఫీలింగ్ క‌లిగింది. కొత్త కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. పాట‌ల‌కు హేషం బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్‌ను చ‌క్క‌గా అందించారు. అశోక్‌గారు విజువ‌ల్స్ ఇంపాక్ట్‌గా ఉన్నాయి. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ గ్రిప్పింగ్‌గా ఉంది. సుహాసినిగారు, గురు సోమ‌సుంద‌రంగారి క్యారెక్టర్స్ ప్రేక్ష‌కుల ఎక్స్‌పెక్టేష్స్‌ను మించి డిఫ‌రెంట్‌గా ఉంటాయి. ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న రెస్పాన్స్‌ను చూసి హ్యాపీగా ఉంది. స‌పోర్ట్ చేసిన అందిరికీ థాంక్స్‌’’ అన్నారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘‘మా స్పార్క్ మూవీ థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సంధ్య థియేట‌ర్‌లో ఆడియెన్స్‌తో క‌లిసి సినిమాను చూశాను. సినిమాలో సాంగ్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, పెర్ఫామెన్స్‌లు, యాక్ష‌న్ సీక్వెన్సులు అన్నీ న‌చ్చుతున్నాయి. సినిమా చూసిన వారంద‌రూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. యూనిట్‌ను అభినందిస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లోని చివ‌రి 20 నిమిషాల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. సుహాసినిగారు, గురు సోమ‌సుంద‌రంగారి క్యారెక్ట‌ర్స్‌లో ఉండే ట్విస్టులను ఊహించ‌లేక‌పోతున్నారు. కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్నీ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ మూవీగా స్పార్క్ మెప్పిస్తుంది. హేషం వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్‌, బీజీఎం ఇచ్చారు. వీటిపై ఆడియెన్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ‘మా ‘స్పార్క్’ మూవీ సక్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌’’ అన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest