ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.
ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరపరిచిన రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు విడుదలై ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాటను యాక్షన్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర యూనిట్.
గూఢచారి 2 మరియు డెకాయిట్ చిత్రాలతో బిజీగా ఉన్నా అడివి శేష్, దర్శకుడు బాల గారి చిరకాల పరిచయం వలన అన్నపూర్ణ 7 ఎకరాల ప్రాంగణంలో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ లో క్యూట్ గా స్వీట్ గా అనే అందమైన లిరికల్ పాటను వీక్షించి విడుదల చేశారు.
అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ “క్యూట్ గా స్వీట్ గా పాట చాలా స్వీట్ గా ఉంది, సాహిత్యం చాలా బాగుంది అని కొనియాడారు. చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ “ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ, క్యూట్ గా స్వీట్ గా అనే అందమైన పాటను విడుదల చేసిన అడివి శేష్ గారికి నా కృతజ్ఞతలు. అడివి శేష్ తన మొదటి చిత్రం అమెరికా లో విడుదల చేయడానికి నన్ను సంప్రదించారు. తనకు మంచి టాలెంట్ ఉంది అని అప్పుడే గమనించాను. మా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మా చిత్రంలోని ప్రతి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు స్వరపరిచిన కళ్యాణి మాలిక్ గారికి కృతజ్ఞతలు. ఈ క్యూట్ గా స్వీట్ గా పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించగా బాహుబలి ఫేమ్ దీపు తన గాత్రంతో ప్రాణం పోశారు.
త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసి, చిత్రాన్ని ఈ సమ్మర్ లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు
సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)
చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్
నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు
సంగీతం : కళ్యాణి మాలిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టి సిరీస్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని
Action Star Adivi Sesh releases 3rd song from Honeymoon Express
Recently, Action Star Adivi Sesh has released Lyrical of Song #3 from ‘Honeymoon Express,’ at the Annapurna Studios 7 Acres Campus.
Meeting started with Bala & Sesh reminiscing their past association in the US, when teen Sesh approached Bala’s company, for distribution of his debut film. Then, Sesh was trying to make it in Hollywood. Bala has expressed his delight to see Sesh as a successful star in India, instead of US.
He thanked Sesh for taking the time for the lyrical release, despite the hectic back-to-back schedules of Goodhachari-2 & Dacoit.
Briefing to Sesh about ‘Honeymoon Express,’ Bala termed it as, “A futuristic romantic comedy with surreal twists and a message about marriage, relationships and society.” Bala also called, ‘Honeymoon Express,’ a ‘musical,’ with singable numbers, skillfully tuned by Kalyani Malik, Spoorthi Jitender, complemented by RP Patnaik’s background score.
Adivi Sesh watched the Lyrical Song, “Cute gaa.. Sweetu gaa..” written by Kittu Vissapragada and sung by Baahubali fame Deepu. Sesh praised the sweet composition, nice poetry, and classy picturization.
Bala said, being a disciple of Sirivennela Seetarama Sastry garu, he asked Kittu Vissapragada to pen the lyrics with Sirivennela’s inspiration, at his standards. He felt, Kittu has lived up to his expectations.
Launching the third Lyrical Song “Cute gaa..Sweetu gaa,” Sesh expressed, “I sincerely wish ‘Honeymoon Express,’ to be a great hit. I’m sure, with such beautiful songs, it will be like a cool breeze in hot summer.”
Jointly produced by KKR & Bala Raj, under the banner of New Reel India Entertainments Pvt. Ltd. ‘Honeymoon Express,’ is a family entertainer.
‘Honeymoon Express,’ is slated for a summer 2024 release.
Presented by: NRI Entertainments (USA)
Banner: New Reel India Entertainments Private Limited.
Cast: Chaitanya Rao, Hebah Patel, Tanikella Bharani, Suhasini, Ali, Surekha Vani, Ravi Verma, Arvind Krishna and others.
Music Director: Kalyani Malik
Background Score: RP Patnaik
Lyricist: Kittu Vissapragada
Art & Cinematography: Sistla VMK
Editing: Uma Shankar G (USA), Sri Krishna Attaluri
Audio: T-Series
PRO: Paul Pavan
Digital PRO: Vamsi Krishna (Cine Digital).
Story and Director : Bala Rajasekharuni