‘హెల్త్‌ ఆన్‌ అస్‌’ యాప్‌ ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌

 

హైదరాబాద్‌:

కరోనా తర్వాత వైద్యరంగం కొత్త పరిస్థితులు చూస్తోందని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘హెల్త్‌ ఆన్‌ అస్‌’ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తా. ‘హెల్త్‌ ఆన్‌ అస్‌’ యాప్‌ వెనుక ఎంతో కృషి ఉంది. ఇలాంటివి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. వైద్య నిపుణులంతా కలిసి ఈ యాప్‌ని ముందుకు తీసుకెళ్లాలి. వైద్య విద్యపూర్తి చేసుకున్న అందరికీ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేవు. కానీ ఇలాంటి యాప్‌లు ఇస్తాయి. ఒక్కోసారి ఆసుపత్రులన్నీ బిజీగా ఉంటున్నాయి. బెడ్‌ కావాలంటే మంత్రులు రికమండేషన్‌ కావాల్సిన పరిస్థితి. కొవిడ్ తర్వాత ఇంటివద్దే మెడికల్‌ కేర్‌ కావాలనుకుంటున్నారు. జనాభా పెరుగుదలతో పాటు మెడికల్‌ కాలేజీలు పెరుగుతున్నాయి. ఈ యాప్‌ మెడికల్‌ కేర్‌, డాక్టర్స్‌ని ఇంటికి తెస్తుందని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest