హైదరాబాద్‌లో భారీ వర్షం ఈదురుగాలుల బీభత్సం చెట్టు కూలి ఇద్దరు మృతి

 

హైదరాబాద్ :

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, మల్కాజిగిరి, తుర్కయంజాల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ ఈదురుగాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి రేకులు, గుడిసెలు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడిపోయాయి. వనస్థలిపురంలో ఈదురుగాలులకు గణేశ్ దేవాలయం ప్రాంగణంలో, ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిపై,రైతు బజర్ సమీపంలో భారీ చెట్లు నెలకొరిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.

చెట్టు కూలి ఇద్దరు మృతి : మరోవైపు, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ ఈదురుగాలులో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఈదురులులతో కూడిన భారీ వర్షానికి తిమ్మాయిపల్లి-శామీర్‌పేట్ దారిలో చెట్టు కూలి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. బైక్‌పై చెట్టు విరిగిపడటంతో నాగిరెడ్డి రామ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ధనుంజయకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతడు చనిపోయాడు. మృతులు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

తీవ్ర తుపానుగా మారిన రెమాల్ : ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘రెమాల్’ తుపాను ఆదివారం తీవ్ర తుపానుగా మారుతోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రెమాల్ తీవ్ర తుపాను ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్ లోని ఖేపుపారా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలపై అధికంగా ఉండనుంది. ఈ తుపాను ప్రభావంతో గరిష్ఠంగా 135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ చెబుతోంది.

పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షం : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, మల్కాజిగిరి, తుర్కయంజాల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ ఈదురుగాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. వనస్థలిపురంలో ఈదురు గాలులకు గణేశ్‌ దేవాలయం ప్రాంగణం, ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిపై, రైతు బజార్ సమీపంలో పార్కు వద్ద భారీ చెట్లు నేలకొరిగాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేరుకుని రహదారిపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలో ఈదురుగాలులు, భారీ వర్షానికి తిమ్మాయిపల్లి- శామీర్‌పేట్‌ దారిలో చెట్టు కూలి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై చెట్టు విరిగిపడటంతో నాగిరెడ్డి రామ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా ధనుంజయకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులను యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు పడమర, వాయువ్య దిశల్లో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఆగ్నేయ రాజస్థాన్‌లో ప్రారంభమై మధ్యప్రదేశ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టానికి 0.9కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడింది. దీని ఫలితంగానే ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా నైరుతి రుతుపవనాలు నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు కాస్త పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే సూచనలున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest