GamGamGanesha theatre rights bagged by @MythriOfficial in Nizam area and #DheerajMogilineniEnertainment will release across AP & Karnataka.@DheeMogilineni
The film starring @ananddeverkonda is all set to release on 31 May.
Anand Devarakonda’s “Gam Gam Ganesha” is getting a grand release on the May 31st through Mythri Movie Distributors in Nizam, AP, and Karnataka.
Anand Devarakonda’s latest movie “Gam Gam Ganesha” is gearing up for a grand theatrical release on the 31st of this month. The distribution companies for this film have been recently finalized. The makers have announced that “Gam Gam Ganesha” will be distributed by Mythri Movie Distributors in Naijam and by Dheeraj Mogilineni Entertainments in AP and Karnataka. The team of “Gam Gam Ganesha” is happy that their film is being released by Dhiraj Mogileni Entertainments and Mythri Movie Distributors, both of which have distributed many huge and successful films.
Pragathi Srivastava and Nayan Sarika star opposite Anand …
నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర పంపిణీ సంస్థలను ఖరారు చేశారు. “గం..గం..గణేశా” సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. పలు భారీ, సక్సెస్ ఫుల్ సినిమాలను పంపిణీ చేసిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా తమ సినిమా విడుదల కావడం సంతోషంగా ఉందని “గం..గం..గణేశా” టీమ్ చెబుతున్నారు.
“గం..గం..గణేశా” లో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించగా..ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన “గం..గం..గణేశా” సకుటుంబ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది.
నటీనటులు :
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.
టెక్నికల్ టీమ్ :
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ
ఆర్ట్: కిరణ్ మామిడి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం – చేతన్ భరద్వాజ్
లిరిక్స్ – సురేష్ బనిశెట్టి
బ్యానర్ – హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని
నిర్మాతలు – కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం – ఉదయ్ శెట్టి