9 మెడికల్ కాలేజీలలో 511 పీజీ సీట్లు

న్యూ ఢిల్లీ :

పునరుత్పాదక విద్యుత్‌పై రాజ్యసభలో ఎంపీ.డా.కె.లక్ష్మణ్ ప్రశ్న.

సమాధానమిచ్చిన మంత్రి ఆర్.కె.సింగ్.

PM – KUSUM పథకం కింద 71.42 మెగావాట్ల కెపాసిటీ కలిగిన రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం, ఫేస్ -2 కింద కేంద్రం మంజూరు చేసింది. కంపోనెంట్ A కింద 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన, కంపోనెంట్ B కింద 400 సోలార్ పంప్స్, కంపోనెంట్ C కింద ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పంపులు కేంద్రం మంజూరు చేసిందని కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణలో 90.87 మెగావాట్ల స్మాల్ హైడ్రోపవర్, 128.10 మెగావాట్ల పవన్ విద్యుత్, 220.37 మెగావాట్ల బయో పవర్, 4,657.18 మెగావాట్ల సోలార్ పవర్, 501.60 మెగావాట్ల లార్జ్ హైడ్రోపవర్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

ప్రశ్న -02

మెడికల్ సీట్లపై రాజ్యసభలో ఎంపీ.డా.కె.లక్ష్మణ్ ప్రశ్న. సమాధానమిచ్చిన కేంద్రమంత్రి డా.భారతీ ప్రవీణ్ పవార్.
9 మెడికల్ కాలేజీలలో తెలంగాణ వ్యాప్తంగా 511 పీజీ సీట్లను సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద పెంచినట్లు కేంద్రమంత్రి డా.భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ప్రధానమంత్రి స్వాస్థ సురక్షా యోజనా కింద 3 మెడికల్ కాలేజీలలో సూపర్ స్పెషాలటీ బ్లాక్స్ ఏర్పాటు చేశామని, బీబీనగర్ లో ఎయిమ్స్ పెట్టినట్లు వెల్లడించారు. తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను 19 ప్రభుత్వ కళాశాలల్లో 3,015 ఎంబీబీఎస్ సీట్లు, 27 ప్రైవేటు కళాశాలల్లో 4,400 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 2014లో 387 మెడికల్ కాలేజీలు ఉంటే 71 శాతం పెరుగుదలతో ఇప్పుడు 600 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2014తో పోలిస్తే 97శాతం ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. 51, 348 ఎంబీబీఎస్ సీట్ల నుంచి ప్రస్తుతము 1,01,043 సీట్లు పెరిగాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 52,778 సీట్లు ఉండగా, 48,265 సీట్లు ప్రైవేటు కాలేజీలలో ఉన్నాయి. 2014లో 31,185 పీజీ సీట్లు ఉండగా.. ప్రస్తుతం 110శాతం పెరిగి 65,335 పీజీ సీట్లు ఉన్నట్లు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest