న్యూ ఢిల్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2023-24 లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చెయ్యి చూపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామిలకు సైతం మోక్షం కలుగలేదు. విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం ఓడరేవు, కాకినాడ పెట్రో కాంప్లెక్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి అసలు ప్రస్తావన లేదు.
బడ్జెట్ కేటాాయింపుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్ర ప్రదేశ్‌కు చేసిన కేటాయింపులు ఇవే..
సెంట్రల్ యూనివర్శిటీ-ఏపీ : రూ. 50 కోట్లు
ట్రైబల్ యూనివర్శిటీ – ఏపీ: రూ. 20 కోట్లు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ : రూ. 170 కోట్లు
ప్రధాన మంత్రి స్వాస్థ్య బీమా యోజన: రూ. 3365 కోట్లు (అన్ని ఎయిమ్స్ సంస్థలకు కలిపి)
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్: రూ. 120 కోట్లు (దేశవ్యాప్తంగా ఏర్పాటైన కొత్త డిజైన్ ఇనిస్టూట్లకు కలిపి)
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన పన్ను వాటా ఇలా..
కార్పొరేషన్ టాక్స్ : రూ. 13,230కోట్లు
కస్టమ్స్ : రూ. 1311,32 కోట్లు
ఇన్‌కమ్ టాక్స్: రూ. 12,871 కోట్లు
సెంట్రల్ జీఎస్టీ: రూ. 13,366 కోట్లు
ఎక్సైజ్ డ్యూటీ: రూ. 549 కోట్లు