హైదరాబాద్
కూకట్ పల్లి లోని ఓమిని ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ చెకప్ సెంటర్ ను సినీనటుడు సుమన్ ప్రారంభించారు. అదేవిధంగా ఆసుపత్రి వారు కొత్తగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ హెల్త్ కార్డు ను సైతం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒక్కసారైనా పూర్తిస్థాయి బాడీ చెకప్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కొన్ని ఆరోగ్య సమస్యలు పూర్తిగా ఆరోగ్యం క్షీణించాకే బయటపడతాయని వాటిని నివారించేందుకు ముందస్తుగా హెల్త్ చెకప్ చేసుకోవడమే ఉత్తమమని ఆయన వెల్లడించారు. మొదటగా కార్డులను ప్రజలకు సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు అందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఓమిని ఆసుపత్రి తమ సేవలను అందిస్తుందని, అత్యాధునిక వసతులతో వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి సీ. ఓ.ఓ.మంజునాథ్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈవో డాక్టర్ నగేష్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.