హైదరాబాద్
హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) చైర్మన్ మచ్చ శ్రీనివాసరావు అదివారం నాడు రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. హాకా చైర్మన్ గా నియమితులు అయిన సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి హాకా ఆధ్వర్యలోసరఫరా చేయనున్న ఉత్పత్తులపై చర్చించారు. రాబోయే రోజుల్లో ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో తమను భాగస్వామ్యం చేయలని కోరారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మహిళా సంఘాలు చేపడుతున్న ఉత్పత్తులను హాకా ద్వారా మార్కెటింగ్ అయ్యేలా సహకరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
Post Views: 196