ముగిసిన బీడీ థర్మల్ పవర్ ఒప్పందం

దిల్లీ:

డీబీ పవర్‌కు చెందిన థర్మల్‌ విద్యుత్‌ ఆస్తుల కొనుగోలుకు అదానీ పవర్‌ (Adani Power) కుదుర్చుకొన్న ఒప్పందం సమయం ముగిసింది. ఒప్పందంలో నిర్ణయించిన తేదీ నాటికి లావాదేవీ పూర్తికాకపోవడమే దీనికి కారణం. ఈ విషయాన్ని అదానీ పవర్‌ (Adani Power) బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది.

డీబీ పవర్‌ థర్మల్‌ విద్యుత్‌ ఆస్తుల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొన్నట్లు అదానీ పవర్‌ 2022 ఆగస్టులో స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ ఒప్పందం విలువ రూ.7,017 కోట్లు. దీనికి సంబంధించిన లావాదేవీని 2022 అక్టోబరు 31 నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. తర్వాత ఈ గడువును నాలుగు విడతలు పొడిగించి 2023 ఫిబ్రవరి 15 వరకు చేర్చారు. తాజాగా ఆ తేదీ కూడా ముగియడంతో ఒప్పందం ముందుకు సాగకుండానే ముగిసిపోయింది. అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఒప్పందం వీగిపోవడం చర్చనీయాంశంగా మారింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest