- సంతాపం వ్యక్తం చేసిన సీఎం జగన్
బెంగళూరు :
నందమూరి తారకరత్న కొద్ది కేపటి క్రితం కన్నుముశారు. తారకరత్న మృతిని వైద్యులు ధృవీకరించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరుకు చేరుకున్నారు. నందమూరి తారకరత్న కొద్ది సేపటి క్రితమే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో కొద్దిదూరం నడిచిన తర్వాత ఆయన తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో తారకరత్నను వెనువెంటనే స్థానికంగా ఉన్న పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను పరీక్షించేందుకు బెంగుళూరు నుంచి ప్రత్యేక వైద్య బృందం హుటాహుటిన కుప్పం వచ్చింది. ఈ క్రమంలో తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు బెంగూళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. నాటి నుంచి అక్కడే వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల విదేశీ వైద్యుల బృందం కూడా తారకరత్న ఆరోగ్యంను పరీక్షింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తారకరత్నను చూసేందుకు నందమూరి కుటుంబం యావత్తు బెంగుళూరుకి తరలివచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వసుంధర, నారా బ్రాహ్మణి, ప్రణతి తోపాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఆసుపత్రికి వచ్చారు.సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇటీవలే ఆసుపత్రికి వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. నారాయణా హృదయలయలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరావయవాలు చక్కగా స్పందిస్తున్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.
నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న
తారకరత్నకు ఒక పాప.
అలేఖ్యారెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్న తారకరత్న
నందీశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అలేఖ్యారెడ్డి
20 ఏళ్ల వయస్సులో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన తారకరత్న
2001లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు నటుడిగా పరిచయమైన తారకరత్న
ఒక వెబ్ సిరీస్ , 22 చిత్రాల్లో నటించిన తారకరత్న
2006 తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తారకరత్న
2009లో అమరావతి చిత్రంతో మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టిన తారకరత్న
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన తారకరత్న
అమరావతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్న తారకరత్న
రాజా చెయ్యి వేస్తే చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటించిన తారకరత్న
విడుదలకావల్సి ఉన్న తారకరత్న సారథి చిత్రం
తారకరత్న నటించిన చిత్రాలుః ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి
తారకరత్న నటించిన చిత్రాలుః ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల
తారకరత్న నటించిన చిత్రాలుః కాకతీయుడు, ఎవరు, మనమంత, రాజా చెయ్యి వేస్తే, ఖయ్యూంబాయ్, దేవినేని, ఎస్ 5 నో ఎగ్జిట్, సారథి
ఒకేసారి 9 సినిమాలు
ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్ రికార్డు సృష్టించిన తారకరత్న
9 చిత్రాల్లో 5 చిత్రాలు మాత్రమే విడుదల
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు చిత్రాలు విడుదల.
తారకరత్న మా కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్ళిపోయాడు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం
నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
సీఎం జగన్ సంతాపం
నటుడు తారకరత్న మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రఘాడ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని జగన్ కోరారు
సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి
ప్రముఖ సినీ నటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనవడు తెలుగుదేశం పార్టీ యువ నేత నందమూరి తారకరత్న మృతి పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన వారి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ అకస్మాత్తుగా కుప్పకూలిన తారకరత్న కోలుకుని ప్రజా జీవితంలోకి తిరిగి వస్తారని భావించామని కానీ దురదృష్టవశాత్తు వారి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. తారకరత్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని సోము వీర్రాజు తెలిపారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటున్నారు.
పవన్ కళ్యాణ్ సంతాపం
నటుడు తారకరత్న మరణం పట్ల జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రఘాడ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పవన్ కోరారు