బెంగళూరు , ఫిబ్రవరి 18 :
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న బ్రెయిన్ స్కాన్ చేశారు. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్న కు చికిత్స కొనసాగుతోంది. 22 రోజులుగా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కోవా నుంచి బయటికి తీసుకువచేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
జనవరి 26న తెలుగుదేశం నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర లో తారకరత్న పాల్గొన్నారు. ఇదే క్రమంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. దేంతో హుటాహుటిన బెంగళూరుకు తరలించారు. అప్పటి నుంచి రోజు చికిత్స చేస్తూనే ఉన్నారు. అయితే శనివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో బాలకృష్ణ హుటాహుటిన బెంగళూరు కు వేయలుదేరి వెళ్లారు.
Post Views: 202