అమరావతి : తారకరత్న మృతితో నారా లోకేష్ యువగలం పాదయాత్రకు బ్రేక్ పడింది. తారకరత్నకి నివాళులు అర్పించేందుకు లోకేష్ ఆదివారం ఉదయం హైదరాబాద్ కు రానున్నారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళులతో..
నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
Post Views: 208